Mate rani chinnadani song Telugu

మాటేరాని చిన్నదాని song lyrics penned by Rajasri, music composed by Ilaiyaraaja, and sung by S.P BalaSubrahmanyam from the movie O Papa Lali.


మాటేరాని చిన్నదాని song lyrics
Song Nameమాటేరాని చిన్నదాని
SingerS.P BalaSubrahmanyam
Music Ilaiyaraaja
LyricstRajasri
Movie O Papa Lali

మాటేరాని చిన్నదాని Song lyrics

మాటే రాని చిన్నదాని 
కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి 
ఆలపించే పాటలు
ప్రేమే నాకు పంచే 
జ్ఞాపకాలురా
రేగే మూగ తలపే 
వలపు పంటరా

మాటే రాని చిన్నదాని 
కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి 
ఆలపించే పాటలు
ప్రేమే నాకు పంచే 
జ్ఞాపకాలురా
రేగే మూగ తలపే 
వలపు పంటరా

వెన్నెలల్లె పూలు విరిసి 
తేనెలు చిలికెను
చెంత చేరి ఆదమరిచి 
ప్రేమలు కొసరెను
చందనాలు జల్లు కురిసె 
చూపులు కలిసెను
చందమామ పట్ట పగలె 
నింగిని పొడిచెను
కన్నె పిల్ల కలలే నాకిక లోకం 
సన్నజాజి కలలే మోహన రాగం
చిలకల పలుకులు 
అలకల ఉలుకులు
నా చెలి సొగసులు 
నన్నే మరిపించే

మాటే రాని చిన్నదాని 
కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి 
ఆలపించే పాటలు
ప్రేమే నాకు పంచే 
జ్ఞాపకాలురా
రేగే మూగ తలపే 
వలపు పంటరా

ముద్దబంతి లేత నవ్వులు 
చిందెను మధువులు
ఊసులాడు మేని వగలు 
వన్నెల జిలుగులు
హరివిల్లులోని రంగులు 
నా చెలి సొగసులు
వేకువల మేలుకొలుపె 
నా చెలి పిలుపులు
సందె వేళ పలికే 
నాలో పల్లవి
సంతసాల సిరులే 
నావే అన్నవి
ముసి ముసి తలపులు 
తరగని వలపులు
నా చెలి సొగసులు 
అన్నీ ఇక నావే

మాటే రాని చిన్నదాని 
కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి 
ఆలపించే పాటలు
ప్రేమే నాకు పంచే 
జ్ఞాపకాలురా
రేగే మూగ తలపే 
వలపు పంటరా

Watch మాటేరాని చిన్నదాని Song Video

మాటేరాని చిన్నదాని song frequently asked questions

Check all frequently asked Questions and the Answers of this questions

This మాటేరాని చిన్నదాని song is from this O Papa Lali movie.

S.P BalaSubrahmanyam is the singer of this మాటేరాని చిన్నదాని song.

This మాటేరాని చిన్నదాని Song lyrics is penned by Rajasri.

By usingYoutube thumbnail downloaderyou can download youtube thumbnails.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు